28న గోల్డెన్ మైల్ పరుగు

Sun,July 21, 2019 07:43 AM

Golden Mile run on this 28th

హైదరాబాద్ : ఈ నెల 28న 26వ గోల్డెన్ మైల్ పరుగును, ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్, హైదరాబాద్ అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ చాంపియన్‌షిప్‌ను గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో, గోల్డెన్ మైల్ పరుగును ఉదయం 9 గంటలకు ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించనున్నారు. గోల్డెన్ మైల్ పరుగులో మహిళలు, పురుషులు మాస్టర్ మహిళలతో పాటు బాలబాలికలు అండర్-16, 13, 10 ఏండ్లలోపు విభాగంలో నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ వెల్లడించారు. ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బాలబాలికలు అండర్-16 విభాగంలో 100, 200, 400 మీటర్లు పరుగులో పాల్గొనాలనుకునే బాలబాలికలు 27న 10 గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 8099917587, 9959993268 ను సంప్రదించాలని కోరారు.

342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles