ఈసారి సికింద్రాబాద్ టికెట్టే కావాలి..

Wed,September 26, 2018 06:28 AM

give me a    ticket    to contest the MLA elections

బంజారాహిల్స్: అంబర్‌పేటలో నన్ను మాటిమాటికీ ఓడగొడుతుండ్రు.. ఈ ఎన్నికల్లో అక్కటి నుంచి పోటీ చేస్తే మళ్లీ ఓడగొడ్తారు.. ఈ సారి నాకు మాత్రం సికింద్రాబాద్ టికెట్టు కావాలే.. ఇగో ముందే చెబుతున్నా చూడండ్రి.. సికింద్రాబాద్ సీటు నాకే ఇయ్యాలి.. లేకపోతే బాగుండదు మల్ల.. వచ్చే ఎన్నికల టికెట్ విషయంపై కాంగ్రెస్ పెద్దలతో ఓ సీనియర్ నాయకుడు చెప్పిన మాటలివి..

అంతర్గత సమావేశాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఢిల్లీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్న సదరు నేతకు, గల్లీలో మాత్రం ఏ మాత్రం బలం లేదన్న సంగతి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇప్పటికే అంబర్‌పేట నుంచి చాలా సార్లు పోటీ చేసినా ఆయనకు గెలుపు సాధ్యం కాలేదు. అయితే ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న సదరు నేత పాత నియోజకవర్గం అయితే మరోసారి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ముందుగానే గుర్తించినట్లు ఉన్నారు. అందుకే ఏకంగా ఓటర్లను తప్పు పడుతూ తనకు ఓట్లేయరు అని కాంగ్రెస్ పెద్దల ముందుకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే జనం ఓటేస్తారని ఆశలతో ఈ సారి సికింద్రాబాద్ సీటు కావాలంటూ పేచీ పెట్టిన సదరు నేతపై కాంగ్రెస్ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారని సమాచారం.

ఇప్పటికే సికింద్రాబాద్ సీటు కోసం పైరవీలు చేస్తున్న కొంతమంది నాయకులు అంబర్‌పేట నుంచి ఇక్కడికి వస్తానని చెబుతున్న సీనియర్ నేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారని టాక్. ఈ పైరవీలు, పట్టుదలతో సదరునేతకు టికెట్ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

5903
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles