రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడితే జైలుకే

Sun,August 13, 2017 05:39 AM

GHMC takes serious action on power theft

హైదరాబాద్ : విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ మొదటిసారిగా అధికారులకు చిక్కితే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. రెండోసారి దొరికితే జైలుకు పంపుతున్నారు. గ్రేటర్‌లో సర్కిళ్లు పెరగడంతో విద్యుత్ చౌర్యాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు అమలు చేస్తోంది. 2017 జనవరి నుంచి జూలై వరకు హైదరాబాద్ సెంట్రల్ పరిధిలో 1450 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేశారు. 140 మందిని జైలుకు పంపారు. ప్రతి నెలా సెంట్రల్ సర్కిల్ పరిధిలో 250-300 విద్యుత్ చౌర్యం కేసులను అధికారులు నమోదు చేస్తున్నారు. రెండోసారి చౌర్యానికి పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు 14 రోజులు జైలుకు పంపుతున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం తెలిపారు.

416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS