నిబంధనలు పాటించని హోటల్స్‌పై అధికారుల కొరడా

Sat,January 12, 2019 04:07 AM

ghmc officers seized hotels which do not maintain fire safety in hyderabad

హైదరాబాద్: నగరంలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పాటించని బార్లు, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ ఫైర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కొరడా ఝుళిపించింది. నిబంధలను తుంగలో తొక్కిన ఆరు బార్లు, రెస్టారెంట్లను అధికారులు సీజ్ చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫైర్‌సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలంటూ బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో గత యేడాది ఆగస్టు 18న జీహెచ్‌ఎంసీ ఫైర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇదే విషయంలో ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో రెండురోజులుగా బార్లు, పబ్‌లపై దాడులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని టికీషా పబ్, అర్బన్ ఏసియా పబ్, రాస్తా కేఫ్, క్యాలన్‌గోట్ రెస్టోబార్, ఈట్ ఇండియా కంపెనీ పేర్లతో నడుస్తున్న పబ్‌లు,రెస్టారెంట్లను సీజ్ చేశారు. రెండురోజుల క్రితం ఇందిరానగర్‌లోని దుర్గా బార్‌ను కూడా అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఎక్సైజ్ పరిధిలో 148 బార్లు, పబ్‌లు, సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 103, రంగారెడ్డి జిల్లాలో 325 బార్లు, పబ్‌లు ఉండగా మరో 138 చోట్ల ఈవెంట్ పర్మిట్ రూమ్ ల పేరుతో బార్లు నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. తక్షణమే ఫైర్‌సేఫ్టీ లేనివారంతా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles