పచ్చదనం..పార్కులు.. వాకింగ్ ట్రాక్‌లు..Sun,August 13, 2017 05:45 AM
పచ్చదనం..పార్కులు.. వాకింగ్ ట్రాక్‌లు..

హైదరాబాద్ :నగరవాసులకు సాధ్యమైనంత ఎక్కువగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో సాధ్యమైనంత ఎక్కువగా పచ్చదనాన్ని పెంపొందించాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా మరిన్ని పార్కులు, వాటిల్లో వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఓ ఉన్నతస్థాయి అధికారుల బృందం శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు జనార్దన్‌రెడ్డి, చిరంజీవులుతో సహా పలువురు అధికారులు ఇందులో ఉన్నారు.

నాగోలు జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంకు రహదారిని పీఎంఆర్ ఫంక్షన్‌హాల్ మీదుగా ప్రస్తుతమున్న రహదారిని మరింత విస్తరించాలని మేయర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఉప్పల్, ఎల్‌బీనగర్ మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఎల్‌బీనగర్ జాతీయ రహదారి కోర్టు కార్యాలయం నుంచి మన్సూరాబాద్ మీదుగా వెళ్లే రోడ్డు మార్గంలో కామినేని జంక్షన్ వద్ద అండర్‌పాస్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను పరిశీలించారు.

కాగా, ఓల్‌ఫెంటా బ్రిడ్జ్జి, మైత్రీవనం మార్గాల్లో మెట్రో రైలు పనులు కారణంగా ప్రధాన రహదారిని మూసివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రోడ్లను మెరుగ్గా తీర్చిదిద్దాలని బల కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మైత్రీవనం, ఓల్‌ఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోడ్డుపై డెబ్రిస్ లేకుండా చూడాలని, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాలని, దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు స్పష్టంచేశారు. రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రోడ్ల వెంబడి డస్ట్‌బిన్‌లు సైతం అడ్డుగా లేకుండా చూడాలన్నారు.

236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS