హైదరాబాద్: నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై పడవేసిన భవన యజమానిపై జీహెచ్ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. భవన నిర్మాణానికి సంబంధించిన ఇటుక, కంకర, ఇసుకతోపాటు ఇతర పదార్ధాలు రోడ్డుపై వేయడంతో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 38లో రాక పోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇటువంటి చర్యకు పాల్ప డిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించారు. దీనికి సంబంధించిన చలాన్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది ఆదివారం అందచేశారు. నిర్మాణ సంబంధిత వస్తువులతోపాటు, భవనం కూల్చి వేసిన వ్యర్థాలు పడివేయడం నేరమనే జీహెచ్ఎంసీ నిబంధనలు ఉన్నప్పటికీ ఇటువంటి చర్యలకు పాల్పడటాన్ని జీహెచ్ఎంసీ సీరియస్‌గా తీసుకుంది.