‘మాన్‌సూన్‌’పై నేడు సమన్వయ సమావేశం

Sat,May 25, 2019 06:44 AM

GHMC Coordination meeting on Monsoon today

హైదరాబాద్ : వరుస ఎన్నికల నియమావళి కారణంగా గత ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన సిటీ సమన్వయ సమావేశం ఈ నెల 25వ తేదీ శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్నది. ప్రధానంగా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్‌పై చర్చించి వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందిపడకుండా తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగరాదనే ఉద్దేశంతో ప్రతినెలా వివిధ శాఖల ఉన్నతాధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఒక్కో నెల ఒక్కో శాఖ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశాలు గత అసెంబ్లీ ఎన్నికల నియమావళి విడుదలైనప్పటి నుంచి జరుగలేదు. ఈనేపథ్యంలో తాజాగా, ఎన్నికల నియమావళి తొలిగిపోవడంతో శనివారం ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు, వర్షాల సందర్భంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించి తగు నిర్ణయాలు చేయనున్నారు. దీంతోపాటు రోడ్లు, గృహ నిర్మాణం, నాలాల విస్తరణ తదితర పనుల్లో ఇతర శాఖల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల నివారణపై కూడా చర్చించి తగు చర్యలు తీసుకుంటారు.

1115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles