ఈ ఏడాదిలో లక్ష ఇండ్లు పూర్తి చేస్తాం

Tue,January 8, 2019 12:44 PM

ghmc commissioner Dana Kishore visits Double Bed Rooms at Uppal

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ దాన కిశోర్ ఇవాళ ఉదయం పరిశీలించారు. ఉప్పల్ కల్యాణపురి, బీరప్పగూడలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. రూ. 8 వేల కోట్లతో నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని, ఈ ఏడాదిలో లక్ష ఇండ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మార్చిలో మన్సురాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ ను త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని దాన కిశోర్ తెలిపారు.

901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles