ఆస్తిపన్నుకు ఈసారి వడ్డీ మాఫీ లేదు

Sun,March 18, 2018 10:00 AM

ghmc commissioner b janardhan reddy requests citizens to pay property tax on time

హైదరాబాద్: ముగుస్తున్న 2017-18 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపునకు ఇక రెండు వారాలే గడువుంది. ఈనెల 31వ తేదీతో గడువు పూర్తవుతున్నందున ఇంకా చెల్లించనివారు వెంటనే చెల్లించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా చివరి నిముషంలో ఆస్తిపన్ను వడ్డీ మాఫీ చేస్తున్నట్లుగా ఈసారి ఉండదని ఆయన స్పష్టం చేశారు. బకాయిదారులు ఆన్‌లైన్‌తోపాటు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో పన్ను చెల్లించాలని కోరారు.

1210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS