సెకన్‌కు 6 కిమి వేగంతో విస్ఫోటనం

Sun,January 20, 2019 07:29 AM

హైదరాబాద్: కాప్రా సాయిప్రియ కాలనీలో బంగారం దుకాణం వ్యాపారి మోహన్‌లాల్ చౌదరి ఇంట్లో జరిగిన పేలుడు... గ్యాస్ లీక్ కారణంగానే జరిగిందని రాచకొండ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సెకన్‌కు 6 కిలో మీటర్ల వేగంతో లీకైన గ్యాస్ దూసుకురావడంతో పేలుడు తీవ్రత విస్ఫోటంగా మారిందని ప్రాథమికంగా పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. శాస్త్రీయంగా జరిపిన విచారణలో ప్రాథమికంగా గురువారం రాత్రి నుంచి పేలుడు జరిగిన సమయం వరకు దాదాపు 6 నుంచి 8 కేజీల గ్యాస్ లీకైందని తెలిసింది.


ఇలా... లీకైన ఎల్‌పీజీ గ్యాస్ ఆ ఇంట్లో ఉన్న ప్రాణవాయువుతో కలిసి అది 1=4 గా మారి మిశ్రమ రసాయనంగా రూపొందింది. దీంతో ఒత్తిడి పెరిగి బయటికి వెళ్లేదారి మూసుకుపోవడంతో రాపిడి పెరిగి... ఆ సమయంలోనే కరెంట్ స్విచ్ వేయడంతో అది పేలుడు రసాయనంగా మారి సెకన్‌కు 6 కిలో మీటర్ల వేగంతో పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించిందని సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలు, అక్కడ నెలకొన్న బీభత్సం, పగిలిపోయిన సామగ్రిని పరిశీలించిన అధికారులకు ఈ విషయం స్పష్టమైంది. ఈ వేగం ఒక తుపాకీ నుంచి బయటికి వచ్చే బుల్లెట్ వేగానికి 100 రేట్లకు పైగా ఉంటుందని ఫోరెన్సిక్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున సాయిప్రియి కాలనీలో జరిగిన విషయం తెలిసిందే. పే లుడులో ఇంటి యజమాని మోహన్‌లాల్ చౌదరితో పాటు మరొకరు మరణించిన విషయం తెలిసిందే.

గ్యాస్ సిలిండర్‌తో భద్రం
ఈ ఘటనను పరిశీలించి పేలుడుకు ప్రాథమిక కారణాలను విశ్లేషించిన హైదరాబాద్ సీసీఎస్ క్లూస్ టీం ఉన్నతాధికారి వెంకన్న, నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ఓ బాంబేనని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ నిర్వహణపై అజాగ్రత్త వహించవద్దని హెచ్చరించారు.

2419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles