పూల కుండీల్లో గంజాయి మొక్కలు

Thu,October 18, 2018 11:56 AM

ganja growing in flower pots in hyderabad

హైదరాబాద్: పూల తోటల్లో గంజాయి మొక్కలను పెంచుతున్న నైజీరియాకు చెందిన ఇద్దర్ని బుధవారం రాత్రి రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక్‌పురి సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలో నైజీరియాకు చెందిన యాకుబ్ అలీ అద్దెకు ఉంటున్నాడు. అతను నాలుగు పూల తొట్లలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అతని ఇంట్లో సోదాలు జరిపారు. ఆ సమయంలో యాకుబ్ అలీ, స్నేహితులు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఓ యువతి కూడా ఉందని తెలిసింది. యాకుబ్ అలీ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్నట్లు సమాచారం.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles