నేడు మట్టి గణపతులు పంపిణీ

Wed,September 12, 2018 07:12 AM

ganesh idols distribute by Pollution control board

హైదరాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణహిత మట్టి గణపతుల పంపిణీకి పీసీబీ ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రెండు లక్షల విగ్రహాలకుపైగా ఉచితంగా భక్తులు అందజేయనున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాలుష్య రహిత (ఎకో ఫ్రెండ్లీ) మట్టి వినాయకులను తయారు చేయించడమే కాకుండా, ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయముచే సహజ రంగుల విగ్రహాలను అలంకరించి ప్రజలకు ఉచితంగా అందజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రెండు లక్షలకు పైగా పర్యావరణహిత విగ్రహాలు పంపిణీ చేయనున్నామని, విగ్రహాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధిత జోనల్, రీజినల్ కార్యాలయం ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 62 కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 26 కేంద్రాల్లో పంపిణీ చేయనున్నామని సత్యనారాయణరెడ్డి చెప్పారు.

సహజ రంగుల వాడకంపై ప్రజలకు అవగాహన
మట్టి విగ్రహాలకు సహజసిద్ధమైన రంగులను వాడకంపై టీవీ స్ర్కోలింగ్, రేడియో జింగిల్స్, వివిధ బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలోని ఎల్‌ఈడీ టీవీల ద్వారా లఘు చిత్రాల ప్రదర్శన పోస్టర్స్, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు సత్యనారాయణరెడ్డి తెలిపారు. 25 లక్షల ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పట్టణంలో ఐదు ప్రాంతాల్లో స్కైబెలూన్స్ ఏర్పాటు చేశామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి మొబైల్ వ్యాన్, మినీ ఆటోట్రాలీల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

గ్రేటర్‌లో..: గణేశ్ టెంపుల్ వైఎంసీఏ (సికింద్రాబాద్), అమీర్‌పేట సత్యం థియేటర్, కోఠి ఉమెన్స్ కాలేజీ, మెహిదీపట్నం రైతుబజార్, ఉప్పల్ క్రాస్‌రోడ్ పోలీస్‌స్టేషన్ వద్ద, ఎల్బీనగర్, నాగోల్ చౌరస్తా, కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, జీడిమెట్ల రైతుబజార్, బాలానగర్ బీవీ దవాఖాన, న్యూసుచిత్ర క్రాస్‌రోడ్, హైకోర్టు ప్రాంగణం/ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, ఆర్‌సీపురం పీసీబీ జోనల్ కార్యాలయం వద్ద, బొల్లారం కేంద్రాల్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో...
- ఎల్బీనగర్ జోన్ : కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్,
- చార్మినార్ జోన్ : మలక్‌పేట, సంతోశ్‌నగర్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ సర్కిల్
-ఖైరతాబాద్ జోన్ : బల్కంపేట వార్డు ఆఫీస్, ఖైరతాబాద్ వార్డు ఆఫీస్, కుందన్‌బాగ్ ఐఏఎస్ ఆఫీసర్స్‌కాలనీ, కార్పొరేటర్స్
-కూకట్‌పల్లి జోన్ : మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్ సర్కిల్
-సికింద్రాబాద్ జోన్ : బేగంపేట, సికింద్రాబాద్ సర్కిల్
-శేరిలింగంపల్లి జోన్ : పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, చందానగర్ (పీజేఆర్ స్టేడియం), యూసుఫ్‌గూడలో పంపిణీ చేస్తారు.

2783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles