తుది సమరానికి యువత సన్నద్ధం

Fri,April 26, 2019 10:32 AM

free training to police aspiring youth in hyderabad

- పోలీసు ఉద్యోగాలకు తుది రాత పరీక్షలకు కసరత్తు
- నగరంలో ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటున్న యువత

హైదరాబాద్: ఉద్యోగమే లక్ష్యంగా యువత కసరత్తు ప్రారంభించారు. తుది పరీక్షలో విజయం సాధించడానికి సాధన ముమ్మరం చేశారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి శిక్షణ కోసం నగరానికి వచ్చిన వారి ఇబ్బందులను గమనించిన నగర పోలీసులు వారికి చేయూత అందించాలని నిర్ణయించాయి. ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగ అభ్యర్థులకు దాదాపు ఏడాదిన్నరగా ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. చివరి దశలో నిర్వహించే రాత పరీక్ష కోసం వారిని సన్నద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతను దృష్టిలో పెట్టుకుని నగర పోలీసులు, భాగ్యకిరణ్ ఇనిస్టిట్యూషన్‌తో కలిసి సంయుక్తంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలకు చేరువయిన పోలీసులు అప్పటి నుంచి శాంతి భద్రతలే కాకుండా నిరుద్యోగ విషయంలో ముందు వరుసలో ఉంటూ యువతకు ప్రోత్సహిస్తుంది. భాగ్యకిరణ్ ఇనిస్టిట్యూషన్‌కు చెందిన పలువురు అధ్యాపకులు ఆయా విషయాల వారీగా అభ్యర్థులకు పాఠ్యాంశాలు బోధించారు. వీరితో పాటు యువతలో ఉన్న పట్టుదల, కసిని చూసి కార్ఖానా సీఐ మధుకర్ స్వామి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాల మేరకు యువతలో స్ఫూర్తి నింపే విధంగా అహర్నిశలు కృషి చేశారు. ఇదే మాదిరిగా తుది పరీక్షకు అభ్యర్థులు హాజరవుతుండగా వారు నేర్చుకున్న సామర్థ్యాన్ని వెలుపలికి తీసేందుకు ప్రతి రోజు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం, వెంటవెంటనే ప్రిలిమ్స్, శారీర ధారుడ్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత ప్రధాన పరీక్ష తేదీని ఖరారు చేయడంతో అభ్యర్థులు కూడా త్వరిగతిన సన్నద్ధమయ్యారు.

ఉచితంగా సామగ్రి పంపిణీ


ఉచిత శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయా పాఠ్యాంశాల వారీగా అర్థమెటిక్, రీజనింగ్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ, చరిత్ర, ఆంగ్లం, ఇండియన్ ఎకానమీ, నైతిక విలువలు, తెలంగాణ సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. అధ్యాపకులకు వేతనాలను కూడా భాగ్యకిరణ్ ఇనిస్టిట్యూషన్ భరిస్తోంది. ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కానిస్టేబుల్, ఎస్‌ఐ పరీక్షల కోసం సామగ్రి(స్టడీ మెటీరియల్)ని పంపిణీ చేశారు.

వర్తమాన వ్యవహారాలపై అవగాహన ఉండాలి..ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులు ప్రధానంగా గత ఆరు నెలలకు సంబంధించిన వార్తా పత్రికలను బాగా చదవాలి. ఇటీవల జరిగిన శాసనసభ, ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు ప్రశ్నలను ఈ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం నుంచి కాకుండా ముందస్తుగా సన్నద్ధమైతే విజయం తప్పక వరిస్తుంది. మొదటగా అభ్యర్థి ఈ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పాఠ్యంశాలు అడుగుతారన్న విషయమై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కాస్త్తా కష్టపడితే ఉద్యోగం సాధించడం సులభమే.
- పి. మధుకర్ స్వామి, సీఐ, కార్ఖానా

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles