నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ

Sun,June 16, 2019 06:55 AM

Free training for unemployed youth

హైదరాబాద్ : నైపుణ్యత అంశాల్లో ఉచిత శిక్షణనిచ్చేందుకు టెక్ మహేంద్ర ఫౌండేషన్ పలు కోర్సులకు సంబంధించి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోందని ఆ సంస్థ సమన్వయకర్త నిరంజన్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పాస్ లేదా ఫెయిల్ అయి ఉండి 18 నుండి 27 ఏండ్లలోపు విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్, ఐటీ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ బీ.కామ్ ఉత్తీర్ణులైన వారికి టాలీ, ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్టీ, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 20లోపు శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, 9515665095లో సంప్రదించాలని కోరారు.

3850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles