బ్యాగులు, బిస్కెట్ల తయారీకి ఉచిత శిక్షణ

Sun,August 13, 2017 06:32 AM

free training for biscuits and jute bags manufacturing

హైదరాబాద్ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) తెలంగాణ వారి సౌజన్యంతో ఎలీఫ్ సంస్థ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగులు, బేకరీ బిస్కెట్ల తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ 20 సంవత్సరాలుగా ఎంతో మంది మహిళలకు ఉచిత శిక్షణ ఇప్పించడమే కాకుండా సొంతంగా కంపెనీలను నెలకొల్పించినట్లు వివరించారు. అర్హులైన మహిళాలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలీఫ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎలీఫ్-ఇండియా, ఎలీఫ్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్, ప్రగతి నగర్, ఎదురుగా జేఎన్‌టీయూ కూకట్‌పల్లి, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలని తెలిపారు. వివరాల కోసం ఫోన్ 040-23735439, 8886661374, 8978988003 లలో సంప్రదించాలని కోరారు.
శిక్షణకు అర్హత
-జ్యూట్ బ్యాగుల తయారీ నెల రోజులు (ఐదవ తరగతి అర్హత)
-బేకరీ బిస్కెట్లు, జామ్ తయారీకి 2 నెలలు (8వ తరగతి అర్హత)

1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles