బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి

Mon,October 15, 2018 06:24 PM

former deputy speaker padma devender reddy participates in bathukamma celebrations

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఇవాళ సాయంత్రం బతుకమ్మ వేడుకలు జరిగాయి. టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, గుండు సుధారాణి, తుల ఉమ‌ హాజరయ్యారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్ మహిళా విభాగం సభ్యులంతా కలిసి బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ ఆట ఆడారు. మహిళలతో పాటు పద్మాదేవేందర్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. తెలంగాణ ఆడ‌బిడ్డ‌లంద‌రికీ ఆమె బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. బ‌తుక‌మ్మ చీర‌లు ఇవ్వ‌కుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న‌ద‌ని ప‌ద్మ మండిప‌డ్డారు.1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS