ప్రియురాలి మృతిని తట్టుకోలేక.. విదేశీ విద్యార్థి ఆత్మహత్య

Wed,May 29, 2019 06:43 AM

foreign student suicide after his lover dead

హైదరాబాద్ : ప్రియురాలు మృతిని తట్టుకోలేక.. కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్న విదేశీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యెమన్ దేశానికి చెందిన మోహ్మద్ ఒర్థ్థమన్(24) ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చాడు. యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుకుంటూ.. టోలీచౌక్ సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను యెమెన్‌కు చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.

కాగా... మూడునెలల క్రితం యువతి క్యాన్సర్‌తో మృతి చెందింది. దాంతో ఒర్థమన్ డిప్రెషన్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా... అతడి వీసా గడువు కూడా ముగియడంతో త్వరలోనే ఇండియాను వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుందని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ నుంచి ఇటీవల లేఖ వచ్చింది. దాంతో మరింత ఆందోళనకు గురైన ఒర్థమన్ సోమవారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు జీవితం బోర్‌గా ఉందని, తన ప్రియురాలు దేవుడి వద్దకు వెళ్లడంతో తాను కూడా ఆమె వద్దకు వెళ్లిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతుడి స్నేహితుడు ఫైసల్ హసన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

3039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles