పతంగులు ఎగుర వేస్తున్నారా? జర జాగ్రత్త

Wed,January 15, 2020 07:27 AM

హైదరాబాద్‌: సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పతంగులు ఎగుర వేస్తుంటారు. అయితే ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పండుగను ఆనందంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి ప్రజలను కోరారు. పండుగ సందర్భంగా ఆయన పలు సూచనలు చేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.


విద్యుత్‌ స్తంభాలపై ఉన్న తెగిన మాంజాలు, పతంగులు తీసేందుకు పిల్లలు, యువకులు ఎవరైనా సరే స్తంభాలు ఎక్కడం కానీ, వాటికున్న దారం పట్టి లాగడం కానీ చేయరాదు. ఇలా చేయడం వల్ల విద్యుత్‌ సరఫరా జరుగుతున్న తీగలు రెండు ఒక దానికొకటి అంటుకొని షార్ట్‌సర్క్యూట్‌ జరిగి షాక్‌కు గురికావడంతోపాటు ఆ విద్యుత్‌ లైన్‌కు అనుసంధానించి ఉన్న గృహాలు/వాణిజ్య సముదాయాల్లో గల టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు కాలిపోయే అవకాశం ఉన్నది. దీంతో ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది.

విద్యుత్‌ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్‌ పరికరాలు లేని చోట పతంగులు ఎగురవేయడం మంచిది.

విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలిపటాలు ఎగురవేయవద్దు n భవనాల మీద నుంచి గానీ, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు. n పతంగులు ఎగుర వేసేందుకు మెటాలిక్‌ ధారాలను వినియోగించరాదు. వీటి వలన విద్యుత్‌ షాక్‌ తగులుతుంది.

విద్యుత్‌ అధికారులు ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు దాని కారణం తెలుసుకుని మాత్రమే సరఫరా పునరుద్ధరించాలి.

ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని పండుగను సంతోషంగా జరుపుకోవాలని. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే 1912కు గానీ, సమీపంలో ఉన్న విద్యుత్‌ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.

402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles