హైదరాబాద్ నుంచి వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు

Wed,February 27, 2019 03:18 PM

Flights to Amritsar dehradun and chandigarh from hyderabad are suspended due to airspace restrictions

హైద‌రాబాద్‌: ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. నిన్న మిరేజ్ దాడి త‌ర్వాత ఇవాళ రెండు దేశాల వైమానిక ద‌ళాలు మ‌ళ్లీ గ‌గ‌న‌త‌లంలో గ‌ర్జించాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాదిలోని కొన్ని విమానాశ్ర‌యాల‌ను మూసివేశారు. పంజాబ్‌లో ఉన్న విమానాశ్ర‌యంలో క‌మ‌ర్షియ‌ల్ ఫ్ల‌యిట్ల సేవ‌ల‌ను ఆపేశారు. పాకిస్థాన్ కూడా కొన్ని విమానాశ్ర‌యాల్లో నిషేధ ఆజ్క్ష‌లు జారీ చేసింది. లాహోర్‌, ముల్తాన్‌, ఫైస‌లాబాద్‌, సియాల్‌కోట్‌, ఇస్లామాబాద్ విమానాశ్ర‌యాల‌ను పాక్ మూసివేసింది. డొమెస్టిక్‌తో పాటు అంత‌ర్జాతీయ ఫ్ల‌యిట్ల‌ను నిషేధిస్తూ పాక్ ఆదేశాల‌ను జారీ చేసింది. భార‌త్‌, పాక్ గ‌గ‌న‌త‌లంలో ప్ర‌యాణించే అన్ని అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. ఈ రూట్లో వెళ్లాల్సిన విమానాల‌ను ప్ర‌త్యామ్నాయ ఎయిర్ రూట్లో తీసుకువెళ్తున్నారు. క‌శ్మీర్‌లోని జ‌మ్మూ, శ్రీన‌గ‌ర్‌, లేహ్ విమానాశ్ర‌యాల‌ను కూడా మూసివేశారు. అమృత్‌స‌ర్‌, డెహ్రాడూన్ విమానాశ్ర‌యాల‌ను కూడా క్లోజ్ చేశారు.

ఈనేపథ్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమృత్ సర్, చండీగఢ్, డెహ్రాడూన్‌లకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాలని అధికారులు సూచించారు.

2165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles