ఇక నగరమంతా ఫీడ్ ద నీడ్

Tue,February 12, 2019 07:01 AM

హైదరాబాద్ : పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే మహోన్నత లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరమంతా విస్తరించనున్నట్లు చెప్పారు. ఫీడ్ ద నీడ్‌పై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్నదానం చేసేవారు, ఆకలితో ఉన్నవారికి మధ్య జీహెచ్‌ఎంసీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ, పండుగలతో పాటు గాంధీ జయంతి, రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు, ఇందులో భాగంగా మొదటి కార్యక్రమం ఈనెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు, ఆహార పదార్థాలు ఇవ్వాలనుకునేవారు ఈ యాప్‌ద్వారా తెలియజేస్తే ఎక్కడ అవసరమో అక్కడికి తామే స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేరవేస్తామని చెప్పారు. ఈపీటీఆర్‌ఐ ఎండీ కల్యాణ్ మాట్లాడుతూ, ఒక కిలో ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసేందుకు 2500 లీటర్ల నీరు అవసరమవుతుందని, దీంతోపాటు పెట్టుబడి, రైతులు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని గుర్తించి ఆహారాన్ని ఎవ్వరూ పడేయకుండా అవసరమైనవారికి అందించాలని కోరారు.

1356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles