ఆయన..ప్రకృతి ఆరాధ్యుడు!

Wed,August 14, 2019 09:47 AM

farmer Planting  hundreds of trees

ఆదిబట్ల: ప్రకృతి అన్నా..మొక్కల పెంపకమన్నా ఆయనకు పంచ ప్రాణాలు. చెట్లతోనే మానవ జీవితం పెనవేసుకుందని భావించిన రైతు మల్‌రెడ్డి శంకర్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో చక్కని చెట్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నగరంలోని చంపాపేట్‌కు చెందిన శంకర్‌రెడ్డి ఎయిర్‌పోర్స్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో శంకర్‌రెడ్డికి 17ఎకరాల భూమి ఉంది. శంకర్‌రెడ్డి తన పొలంలో స్వయంగా వ్యవసాయం చేస్తున్నాడు. పొలం గట్టు చుట్టూ వరస క్రమంలో వివిధ రకాల మొక్కలు నాటారు. 10 ఏండ్ల కిందటే శంకర్‌రెడ్డి మొక్కలు నాటారు.

ప్రస్తుతం శంకర్‌రెడ్డి పొలంలో నాటిన 1500 టేకు మొక్కలు పెద్ద వృక్షాలుగా పెరిగాయి. శంకర్‌రెడ్డి వ్యవసాయ క్షేతంలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంది. పదేండ్ల కింద నాటిని మొక్కలు ఏపుగా పెరిగిన వృక్షాలు ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నాయి. రోజూ శంకర్‌రెడ్డి చంపాపేట్ నుంచి ఆదిబట్లలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు.. పొలం చుట్టూ తిరిగి చెట్లను పరీశీలిస్తారు. టేకు చెట్లతో పాటుగా వేప చెట్లు, మామిడి. అల్లనేరేడు వంటి చెట్లతోపాటుగా వివిధ రకాల ఫలసాయం ఇచ్చే చెట్లు, పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. ప్రతి రోజు గట్ల వెంబడి తిరిగి చెట్లను పరిశీల చేస్తూ..వాటిని ప్రాణం కన్న మిన్నగా చూసుకుంటున్నారు. వేసవిలో కూడా శంకర్‌రెడ్డి చెట్లకు ప్రత్యేక నీటి వసతిని కల్పిస్తున్నారు. పైపులైన్‌తో చెట్లకు నీరందిస్తారు. ఒక్క చెట్టును కూడా గొడ్డలి వేటుకు గురి కాకుండా కంటికి రెప్పాలా కాపాడుతున్నారు. ఇలాంటి వారు ఉంటే తెలంగాణ మొత్తం హరితవర్ణంగా మారుతుందనటంలో సందేహం లేదు.

మొక్కలు పెంచే బాధ్యతను అందరూ తీసుకోవాలి

మొక్కలు పెంచే బాధ్యతను ప్రతీ పౌరు డు తీసుకోవాలి. ప్రకృతి, చెట్లతో మానవ జీవితం ముడిపడి ఉంది. చెట్లు లేకపోతే మనుషులు బతకడం కష్టం. అడవులు అం తరించి పోవడం వల్ల నేడు వర్షాలు కూడా అంతగా కరువడం లేదు. పదేళ్లగా నేను అనేక మొక్కలను పెంచుతున్నాను. సీఎ కేసీఆర్ హరితహారం పథకం ద్వారా మొక్క లు పెంచేందకు కృషి చేయటం బాగుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొక్క లు నాటాలి.
- శంకర్‌రెడ్డి, రైతు

653
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles