లిక్కర్‌ షాపుల కోసం భారీగా పోటీపడిన వ్యాపారులు

Thu,October 17, 2019 07:34 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం లిక్కర్‌ వ్యాపారులు భారీగా పోటీపడ్డారు. 2,216 మద్యం దుకాణాల కోసం 48,401 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వానికి రూ.968.02కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి ఎక్సైజ్‌ డివిజన్‌ నుంచి 8892 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ నుంచి 8101 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల ఎంపిక ఉంటుందని చెప్పారు.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles