బెస్ట్ అవెలబుల్ స్కీమ్ కింద ప్రవేశాలు

Mon,May 21, 2018 08:18 AM

Entries under the Best Availability Scheme in Hyderabad schools

హైదరాబాద్ : బెస్ట్ అవెలబుల్ స్కీమ్ కింద ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. యోగితారాణా ఒక ప్రకటనలో తెలిపారు. 2018- 19 విద్యా సంవత్సరానికి గాను నాన్ రెసిడెన్షియల్ కోటాలో 1వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వార్షికాదాయం రూ. 2 లక్షలకు మించని, హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులై ఉండి, 01-06- 2012 - 31-05-2013 మధ్యకాలంలో జన్మించిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. జిల్లాలో 90 సీట్లు కలవని, 90కి మించి దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా నిర్వహించి ఎంపిక ప్రకియను చేపడతామని వెల్లడించారు. దరఖాస్తు చేసిన విద్యార్థితో పాటు తల్లిదండ్రులు లక్కీ డ్రా నిర్వహించే సమయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే ప్రవేశం కల్పిస్తామని తెలిపారు.

ముఖ్యమైన తేదీలు


దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమవుతుందని, దరఖాస్తులకు 27తో ముగుస్తుందని, లక్కీ డ్రా 30న నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఎంపిక సమయంలో సమర్పించాల్సినవి..


- మీసేవా ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం
-మీసేవా కేంద్రం ద్వారా జారీ అయిన ఆదాయ ధృవీకరణ పత్రం
-మున్సిపల్ కార్పొరేషన్, తహసీల్దార్ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డ్
- రేషన్‌కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్


1852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles