టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి ఈడీ భారీ షాక్‌

Tue,April 2, 2019 08:52 PM

హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ భారీ షాకిచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వైస్రాయ్‌ హోటల్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.315 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ.364 కోట్ల కుచ్చుటోపీ. భారీ ఎత్తున షెల్‌ కంపెనీలను సుజనా సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. నకిలీ ఆస్తులు, బోగస్‌ ఇన్వాయిస్‌లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. సెంట్రల్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్‌ బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తాన్ని షెల్‌ కంపెనీలకు సుజనా తరలించారు. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కేసులో వైస్రాయ్‌ ఆస్తులు తాత్కాలికంగా జప్తు చేశారు. బ్యాంకుల నుంచి రూ.364కోట్లు రుణాలు తీసుకుని మోసం చేసినట్లు బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేస్తోంది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ సృజనా గ్రూపు సంస్థేనని ఈడీ పేర్కొంది. మహల్‌ హోటల్‌ ద్వారా వైస్రాయ్‌కి సృజనగ్రూప్‌ నిధులు మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా ఆఫీస్‌ నుంచి అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. షెల్‌ కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

3162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles