ఓటర్ల తుది జాబితా వివరాలు వెల్లడి: సీఈఓ రజత్‌కుమార్‌

Fri,October 12, 2018 11:13 PM

Election Commission of India   release the electoral list of voters in Telangana

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. తాజాగా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 2కోట్ల 73లక్షల 18వేల 603 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అందులో 1,37,87,920 మంది పురుష ఓటర్లు.. 1,35,28,020 మంది మహిళా ఓటర్లు.. త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఓటర్లు 9,451 మంది.. రాష్ట్రంలో ఓటుహక్కు కలిగిన థర్డ్ జెండర్లు 2,663 మంది ఉన్నట్లు పేర్కొంది. తుది జాబితా విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం అధికారులు వేచిచూస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈసీ అనుమతి రాగానే తుది జాబితాలు ప్రచురిస్తామని వివరించారు.

2044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles