నేడు, రేపు సెలవు

Wed,April 10, 2019 07:34 AM

Election Commission declared public holiday tomorrow

మేడ్చల్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల10వ తేదీన విద్యాసంస్థలకు, 11వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని పరిశ్రమలకు, ఫ్యాక్టరీలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. 11వ తేదీన పోలింగ్ ఉన్నదని, జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.

11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు

ఈనెల 11న ఓటింగ్‌రోజు సెలవు ప్రకటించని సంస్థలపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్-135(బీ) ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్‌ హెచ్చరించారు. 11వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కొన్ని సంస్థలు ఇంకా సెలవు ప్రకటించలేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటివారిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

7874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles