ఏప్రిల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2,282 కేసులు.. 498 మందికి జైలు

Thu,May 2, 2019 07:51 AM

drunk and drive cases filed in april are 2282 in hyderabad

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏప్రిల్ నెలలో 2,282 మంది పట్టుబడ్డారని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందులో 498 మందికి జైలు శిక్షలు, 167 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి 3, 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు తీర్పునిచ్చాయన్నారు. వీటితోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న నలుగురికి రెండు రోజులపాటు శిక్షలు కోర్టులు ఖరారు చేశాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో గత నెలలో పట్టుబడ్డ ఉల్లంఘనదారులకు రూ.49,64,400 జరిమానాను న్యాయస్థానం విధించిందని అదనపు సీపీ వివరించారు.

619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles