దిగ్విజ‌య్ దిమాక్ ఖరాబ్ అయిందా..!

Mon,May 1, 2017 04:05 PM

Does Digvijay Singh lost his mind, after his removal as Goa incharge

హైద‌రాబాద్: దిగ్విజ‌య్‌కు పిచ్చిప‌ట్టిందా ? వేటు ప‌డ్డాక మ‌తిపోయిన‌ట్టుంది ! ఇంచార్జీ ప‌ద‌వులు ఊడాక‌ ఏం చేయాలో అర్థం కావ‌డంలేదు. సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్ దిగ్విజ‌య్ తెలంగాణ పోలీసుల‌పై ట్వీట్ చేసిన వ్యాఖ్య‌లు ఆయన నైజాన్ని బ‌య‌ట‌పెడుతున్నాయి. దేశ భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగిస్తున్న ఉగ్ర‌మూక‌ల‌ను ప‌ట్టుకుంటున్న పోలీసులను మెచ్చుకోవాల్సింది పోయి, ఇలా నోరు జారితే ఎవ‌రికి చేటు.

అధికారం కోల్పోవ‌డంతో ఇలా మ‌తిలేని మాట‌లు పుట్టుకొస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ ప్ర‌భావం వ‌ల్ల దేశంలో చాలా మంది యువ‌త ప్రేర‌ణ‌పొందుతున్నారు. వాళ్ల‌ను ప‌ట్టుకునేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా ఉగ్ర‌మూక‌ల క‌దలిక‌ల‌కు చెక్ పెట్టేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు.

ఇటీవల క‌ర్నాట‌క‌, గోవా రాష్ట్రాల ఇంచార్జీ ప‌ద‌వి నుంచి దిగ్విజయ్ ను త‌ప్పించిన త‌ర్వాత కాంగ్రెస్ నేత‌కు ఏమీ తోయ‌డంలేదు. గోవాలో బీజేపీ క‌న్నా ఎక్క‌వ సీట్లు సాధించినా, అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు ఆ రాష్ట్రానికి ఇంచార్జీగా ఉన్న దిగ్విజ‌య్ ఆ వ్య‌వ‌హారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌లేక‌పోయారు. దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ దిగ్విజ‌య్‌ను గోవాతో పాటు క‌ర్నాట‌క రాష్ట్రాల‌కు ఇంచార్జీ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది.

ఆ షాక్‌లో ఉన్న దిగ్విజ‌య్ నిరాధారంగా తెలంగాణ పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయం. అత్యంత చాకచ‌క్య‌మైన తెలంగాణ పోలీసులు ఇస్లామిక్ స్టేట్ సానుభూతిప‌రుల‌ను ప‌ట్టుకునేంద‌కు తీవ్ర క‌స‌ర‌త్త‌లు చేస్తున్నారు. అలాంటి పోలీసుల నైతిక‌త దెబ్బ‌తీస్తున్న కాంగ్రెస్ నేత‌ను ఆ పార్టీ సీనియ‌ర్లే అడ్డుకోవాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు దిగ్విజ‌యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌. ఆధారంలేని ఆరోప‌ణ‌లు చేస్తున్న దిగ్విజ‌య్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కూడా న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నది.

3269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles