యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్ రిమాండ్

Thu,May 2, 2019 07:57 AM

doctor harassed young woman who came to treatment in hyderabad

హైదరాబాద్: వైద్యం కోసం వచ్చిన యువతితో లైంగిక వేధింపులతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ డాక్టర్‌ను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో గోపాలపురం ఏసీపీ కె.శ్రీనివాసరావు, డీఐ టి.నర్సింహారాజు వివరాలు వెల్లడించారు. పద్మారావునగర్ సాయి రుక్మిని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే కోషికా చంద్రమోహన్(65) సికింద్రాబాద్ మైలార్‌గడ్డలో శ్రీహోమియోపతి క్లినిక్‌తోపాటు మందుల షాపు నిర్వహిస్తున్నాడు.

గత 20 ఏండ్లుగా ఇక్కడే క్లినిక్‌తోపాటు మెడికల్ షాపు ఉంది. కాగా, నామాలగుండు ప్రాంతానికి చెందిన యువతి(22)కి చర్మ వ్యాధి సోకడంతో చికిత్స నిమిత్తం మైలార్‌గడ్డలోని హోమియో క్లినిక్‌కు వచ్చింది. కాగా దాదాపు గత మూడు నెలలుగా భర్తతో పాటు కలిసి వచ్చి ఇక్కడే చికిత్స తీసుకుంటున్నది. భర్త డ్యూటీకి వెళ్లడంతో గత నెల ఏప్రిల్ 30న మంగళవారం ఎప్పటిలాగే మెడికల్ చెకప్‌కు వచ్చింది. కాగా డాక్టర్ ఆమెను చెకప్ రూంలోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడు. షాక్‌కు గురైన ఆ యువతి వెంటనే భర్తకు విషయం చెప్పింది.

దీంతో వారు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను చేసిన తప్పును ఒప్పుకోవడంతో పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఐలు వరుణ్‌కాంత్‌రెడ్డి, మధు ఉయ్యాల, రవికుమార్, రాజునాయక్, రాజశేఖర్‌గౌడ్, డీఎస్‌ఐ శ్రీనివాస్‌లతో పాటు క్రైం సిబ్బంది పాల్గొన్నారు.

2211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles