కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు

Mon,November 11, 2019 07:08 AM

విద్యా విధానంలో కొత్త మార్పులు
ప్రభుత్వ పాఠశాలలో టచ్ స్క్రీన్‌లు..
సాంకేతికతను జోడించి విద్యా బోధన
సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు


హైదరాబాద్ : విద్యా విధానంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో కనిపించిన డిజిటల్ తరగతులు నేడు ప్రభుత్వ పాఠశాలల్లో దర్శనమిస్తున్నాయి. దానికి తోడు మేడ్చల్ జిల్లాలోనే మొట్టమొదటి సారిగా కూకట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో హోప్ ఫౌండేషన్, నెక్ట్స్ ఎడ్యుకేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్రియేట్ ఏ బ్రైట్ టుమారో ఫర్ టుడేస్ స్టూడెంట్స్ అన్న పేరుతో సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా టచ్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యాంశాలను టచ్ స్క్రీన్ బోర్డుల ద్వారా బోధిస్తున్నారు. ఒక్కొక్కటి సుమారు రెండు లక్షల విలువ గల టచ్ స్క్రీన్ బోర్డులు మూడు తరగతులలో ఏర్పాటు చేశారు. అయితే కండ్లకు కట్టినట్లు విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బోధన ద్వారా పాఠ్యాంశాలు సులువుగా అర్ధం అవుతున్నాయని తెలుపుతున్నారు.

విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతున్నది
గతంలో ఉన్న విధానంలో కాకుండా సాంకేతికతను జోడించి ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. నేడు మారుతున్న సాంకేతికత, స్మార్ట్ ఫోన్‌లు, టెక్నాలజీతో పోటీ పడుతూ విద్యార్థులకు చదువు చెప్పాల్సిన అవసరం ఉంది.
నరేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు

వీడియోల రూపంలో బోధించడం బాగుంది
పాఠ్యాంశాలు అన్ని వీడియోల రూపంలో ఉండడంతో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారానే ప్రయోగాత్మకంగా వీడియోల ఆధారంగా బోధించడం ఎంతో బాగుంది. విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుంటే విద్యార్థుల్లోనూ నూతనోత్సహం కనిపిస్తుంది.
ఉమా వసుంధర, బయాలజి ఉపాధ్యాయురాలు

594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles