లంచం అడిగితే డయల్ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064

Mon,June 25, 2018 06:49 AM

Dial toll-free 1064 to lodge complaints on corruption

హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. ఉద్యోగుల అవినీతి సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 1064 నంబర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని. ప్రజలు లంచం ఇవ్వకుండా ఫిర్యాదు చేసి సహకరించినప్పుడే అవినీతి నిరోదక శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు.

2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles