బయో ఏషియా సదస్సులో లైఫ్ సైన్సెస్ గ్రోత్‌పై చర్చ

Fri,February 23, 2018 06:50 PM

Debate on Life sciences growth in bio asia 2018 hyderabad

హైదరాబాద్: నగరంలోని హెచ్‌ఐసీసీలో నిన్న బయో ఏషియా సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 24 వరకు ఈ సదస్సు జరగనుంది. ఇవాళ సదస్సు రెండో రోజు ఇండియన్ లైఫ్ సైన్సెస్ గ్రోత్ అనే అంశంపై ప్యానెల్‌లో చర్చించారు. ఈ చర్చలో మంత్రి కేటీఆర్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డా. ఈశ్వర రెడ్డి, రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్ రెడ్డి, ఫార్మా కంపెనీల ప్రముఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. దేశంలోని అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఫార్మా సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇప్పుడున్న జీనోమ్ వ్యాలీని విస్తరిస్తామన్నారు. దీంతో ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్ రంగాల్లో పరిశోధనలు పెరుగుతాయన్నారు.

1318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles