కూతురిపై లైంగికదాడి : నిందితుడు అరెస్ట్

Sat,May 25, 2019 06:16 AM

daughter harassed by father in hyderabad

హైదరాబాద్ : కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రిని మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ కథనం ప్రకారం... కె.రాజు(30) మల్కాజిగిరిలో నివాసం ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. అతని భార్య టీస్టాల్ నడుపుతుంది. వీరికి నలుగురు కుమార్తెలు. కాగా... ఈ నెల 21న రాజు భార్య ముగ్గురు కూతుళ్లతో కలిసి టీ స్టాల్ వద్దకు వెళ్లగా.. ఇంట్లో రెండో కూతురు(12) ఒక్కతే ఉంది. తిరిగి తల్లి రాత్రి 10గంటలకు ఇంటికి రాగా.... రెండో కూతురిపై భర్త లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వెంటనే ఆమె కేకలు వేయగా అతను పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

6027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles