ఒక్క ఫోన్ కాల్ కొడితే ప‌శువుల డాక్ట‌ర్ వ‌స్తాడు

Fri,September 15, 2017 06:25 PM

Dail 1962 for veterinary doctor in Telangana

హైద‌రాబాద్ : గ్రామ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. వ్య‌వ‌సాయం, పాడీ, పంట‌ల‌ను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ మేలైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ సంచార ప‌శువైద్య‌శాల‌ల‌ను ప్రారంభించారు.ఒక్కొక్క‌టి రూ. 14.65 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో 100 ఆంబులెన్స్‌ల‌ను సీఎం ప్రారంభించారు. రైతులు త‌మ జంతువుల‌కు ఏదైనా జ‌బ్బు చేస్తే ఫోన్ చేయ‌డానికి టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌ను ప్ర‌క‌టించారు. 1962 నెంబ‌ర్‌కు డ‌య‌ల్ చేస్తే నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎక్క‌డికైనా అరగంట‌లో ఈ ఆంబులెన్స్ చేరుకుంటుంది.

ఒక్క ఫోన్ కాల్‌తో వెట‌ర్న‌రీ డాక్ట‌రు మీ ప‌శువుల కొట్టం ముందుంటాడ‌ని సీఎం అన్నారు. ఫోన్ చేసిన‌పుడే కాకుండా ప‌శువైద్య శాల ప్ర‌తిరోజూ ఊరూరు తిరుగుతూ రైతులు సాదుకుంటున్న ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి జంతువుల‌ను చెక్ చేస్తూ ఉంటార‌ని సీఎం వివ‌రించారు. గ‌త పాల‌కులు తెలంగాణ‌ రైతుల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని, రైతును ఆర్థికంగా నిల‌దొక్కుకునేలా చేయ‌డమే త‌మ ప్ర‌భుత్వ ధేయ్య‌మ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

1882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles