ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ముఠాపై సైబరాబాద్ కాప్స్ నజర్

Fri,August 31, 2018 08:53 AM

Cyberabad police Surveillance on north india gang hulchul in hyderabad

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం మరో భారీ కుంభకోణం ఛేదనపై నజర్ పెట్టింది. నెల రోజుల కిందట ఏర్పడిన ఈ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కరక్కాయల పౌడర్ స్కాంను ఛేదించి ప్రధాన సూత్రధారులైన మల్లికార్జున్‌తో పాటు మరికొంత మందిని అరెస్టు చేసి రూ.41 లక్షలను స్వాధీనం చేసుకుంది. తాజాగా ఈ విభాగం పోలీసు ఉన్నతాధికారులు అమాయక ప్రజలను మోసం చేసే వాణిజ్య ప్రకటనలపై దృష్టిపెట్టారు. దీంట్లో భాగంగా ఓ ఉత్తరాది ముఠా నగరంలో తిష్ట వేసి నిండా ముంచేందుకు పథకం రచించినట్లు సమాచారం అందింది.

మోసానికి వ్యూహం పన్నిన ముఠా 7 వేల నగదును మొదట డిపాజిట్ చేస్తే ఐదు జతల బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత ప్రతి నెల రూ.2700 లను 12 నెలల పాటు ఇస్తామని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఇలా అమాయకులను ఆకటుకొని భారీ మోసానికి శ్రీకారం చుట్టారని తెలుసుకుని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ఇప్పుడు ఆ ముఠాపై కన్నేసింది. దేశవ్యాప్తంగా ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు రూ. 30 కోట్లపైనే కొల్లగొట్టిందని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలవేదికగా ఈ ముఠా అమాయకులకు గాలం వేస్తుందని తెలుస్తోంది. నిఘాలో ఈ ముఠా భాగోతం గురించి తెలుసుకున్న సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం త్వరలోనే ఈ మోసానికి చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తుంది.

713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS