'సైబర్'... నయా మోసం

Wed,November 14, 2018 06:27 AM

cyber crime police alerted to citizens

ఆర్డర్ బుక్ చేసుకోండంటూ.. చిన్న వ్యాపారులకు గాలం
పేటీఎంలో అడ్వాన్స్ అంటూ డబ్బులు కాజేస్తున్న వైనం
పాస్‌వర్డు ఛేంజ్.. ఖాతాలోని నగదు బదిలీ
సైబర్ నేరగాళ్ల సరికొత్త నేర ప్రకియ
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైం పోలీసులు


హైదరాబాద్ : మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రూ. 20వేల చికెన్ ఆర్డర్ ఉంది.. బర్త్‌డే పార్టీకి మంచి భోజనం కావాలి, 200 మందికి రెడీ చేయండి.. చిన్న గెట్ టూ గెదర్ పార్టీ ఉంది.. మీ బేకరీ ఐటమ్స్ కావాలి...గూగుల్ సెర్చ్‌లో మీ హోటల్, మీ దుకాణం, మీ బేకరీ గురించి తెలుసుకున్నాం... మీకు మంచి పేరుంది.. ఈ మాటలు వినగానే సహజంగా ఏ వ్యాపారైన మంచి ఆర్డర్ అంటూ ఖుషీ పడతాడు.

చెప్పండి సార్.. డెలివరీ డేట్ చెప్పండి..అడ్వాన్సుగా కొంత నగదు ఇస్తే చాలు మీకు టైంకు డెలివరీ అవుతుందని ఒప్పందానికి రెడీ అంటారు. ఒకే ఆర్డర్ ... అడ్వాన్స్ కింద మీ పేటీఎంకు డబ్బును పంపిస్తాను...మీ ఫోన్‌కు ఓ కోడ్ వచ్చింది... జస్ట్ అది చెబితే చాలు మీకు నగదు బదిలీ అవుతుందని చెబుతారు. వెంటనే వ్యాపారులు ఆర్డర్ వచ్చిందనే సంతోషంతో ఏమి ఆలోచించకుండా వారి ఫోన్‌కు వచ్చి కోడ్ నం.ను చెప్పేస్తారు. ఇక అంతే నిమిషాల్లో మీ పేటీఎం పాస్‌వార్డు మారిపోయి అందు లో ఉన్న నగదు ఖాళీ అవుతుంది. ఇలా ... సైబర్ క్రిమినల్స్ సరికొత్త పంథాలో ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు.

ఈ తరహా ఫిర్యాదులు ఇప్పు డు నెలకు రెండు నుంచి మూడు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు అందుతున్నాయి. పోయిన సొత్తు చిన్నదైనా నేర ప్రక్రియ కొత్తగా ఉండడంతో సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తం చేస్తున్నా రు. ముఖ్యంగా తమ వ్యాపారానికి సంబంధించి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో నమోదు చేసుకున్న వ్యాపారులు ఫోన్‌లలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చే ఆర్డర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని నమోదవుతున్న ఫిర్యాదులు హెచ్చరిస్తున్నాయి.

ఫర్‌గాట్ పాస్‌వర్డు ఆప్షన్‌తో మీ పాస్‌వర్డు ఛేంజ్...
సైబర్ క్రిమినల్స్ ముందుగా ఆర్డర్ అంటూ మీకు ఫోన్ చేస్తారు. ఆ తర్వాత అడ్వాన్సును మీకు పేటీఎంలో బది లీ చేస్తామని నమ్మిస్తారు. దీని కోసం వారు మీ యూజర్ నేమ్, పాస్‌వర్డును అడుగుతారు. సహజంగా పేటీఎంలకు మొబైల్ ఫోన్ నంబర్‌ను యూజర్ నేమ్‌గా పెడతారు. ఒక వేళ పాస్‌వర్డు చెప్పకపోయినా.. సైబర్ క్రిమినల్ యూజర్ పాస్‌వర్డు టైప్ చేసి ఆ తర్వాత ఫర్‌గాట్ పాస్‌వర్డు లేదా ఛేంజ్ పాస్‌వర్డు ఆప్షన్‌కు వెళ్తాడు. అప్పు డు సహజంగా పేటీఎం ఖాతాదారుడికి ఓ ఓటీపీ వస్తుం ది. దీనిని కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అడ్వా న్సు బదిలీకి సంబంధించి మీకు ఓ కోడ్ వచ్చింది... అది చెబితే చాలు మీకు పేటీఎం ఖాతాలో నగదు జమవుతుందని వివరిస్తాడు. ఇది నిజమే నని నమ్మి చాలా మంది ఏమి ఆలోచించకుండా ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పగానే... సైబర్ మోసగాళ్లు దానిని టైప్ చేసి వారి సొంత పాస్‌వర్డును సృష్టిస్తారు. ఇలా... మన పేటీఎం ఖాతాను వారి కంట్రోల్‌కు తెచ్చుకుని యూజర్ నేమ్, పాస్‌వర్డులు టైప్ చేసుకొని మన ఖాతాలో ఉన్న నగదును ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయడం, ఇతర వ్యాలెట్‌లకు నగదు బదిలీ చేసుకొని బురిడీ కొట్టిస్తారు. మన ఫోన్ నంబర్‌కు మెసేజ్ వచ్చే లోపు ఖాతాలో ఉన్న నగదును కాజే స్తారు. ఈ విధంగా సైబర్ మాయగాళ్లు ఇప్పుడు చిన్న చిన్న వారిని టార్గెట్ చేసి వేలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఈ విధమైన నేరప్రక్రియతో సైబర్ క్రిమినల్స్ దేశవ్యాప్తంగా కొల్లగొడుతున్న డబ్బు రోజుకు కోట్లలో ఉంటుందని సైబర్ క్రైం పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఓటీపీ అసలు చెప్పొద్దు...
సైబర్ మాయగాళ్లు ఓటీపీ అని చెప్పకుండా ఈ మధ్య కోడ్ నంబర్, ఐదు సిరీస్‌ల నంబర్ వచ్చిందని చెప్పి వాటిని సేకరిస్తున్నారు. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ గానీ బ్యాంకుకు సంబంధించిన ఇతర ఏ నంబరైనా గుర్తు తెలియని వారికి చెప్పొద్దు. మర్చిపోయి చెప్పినా, వేరే ఆలోచనలో ఉండి చెప్పినా పోయిన డబ్బులు మీ చేతికి తిరిగి రావు. సైబర్ మాయగాళ్ల ఎత్తులను అప్రమత్తత తో తిప్పికొట్టాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నా రు. ముఖ్యంగా తాజా నేర ప్రక్రియతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్డర్ బుక్ చేసుకున్నా.... మనిషిని నేరుగా కలిసిన తర్వాతనే తదుపరి వ్యవహారాలు జరపాలి. అంతేగాని ఆర్డర్ వచ్చిందని ఆశలో గంతులేసి పైసా..పైసా కూడబెట్టిన నగదును వారి చేతుల్లో పెట్టొద్దని పోలీసులు కోరుతున్నారు.

2355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles