గ్రేటర్ హైదరాబాద్‌లో పెరిగిన కరంట్ వాడకం

Sun,March 31, 2019 09:27 AM

currant usage increased in Greater Hyderabad

హైదరాబాద్: రాజధానిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయి విద్యుత్ వినియోగం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది మార్చిలో మొత్తం 56.7 మిలియన్ యూనిట్లు వాడగా.. ఈసారి ఐదు మి. యూనిట్లు పెరిగి 29వ తేదీ నాటికి 61.3 మి.యూనిట్లుగా నమోదైంది. గత వారం రోజుల్లోనే డిమాండ్ ఏడు మి.యూనిట్లు పెరుగడం గమనార్హం. ఈనెల 24న 54.2 మి.యూనిట్ల వినియోగం ఉండగా.. 29వ తేదీ నాటికి నాటికి 61.3 మి.యూనిట్లకు పెరిగింది. అంతరాయం లేని విద్యుత్ సరఫరా, నాణ్యత పెరుగడం, ఇండ్లు, దుకాణాలు, పరిశ్రమలకు కావాల్సినంత కరంటు అందుతుండడం వంటివి వినియోగం పెరుగడానికి దోహదం చేశాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు గ్రేటర్ పరిధిలో గరిష్ఠ డిమాండ్ 2,700 మెగావాట్లకు చేరుకున్నది.

679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles