షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి..నష్టం రావడంతో..

Fri,November 9, 2018 07:15 AM

Couple suicide due to sharemarket loss

హైదర్‌నగర్/తెలుగుయూనివర్సిటీ : షేర్ మార్కెట్‌లో నష్టం రావడంతో..ఆర్థిక ఇబ్బందులు పెరిగి దంపతులు వేర్వేరు గా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్‌ఐ హరి శంకర్ కథనం ప్రకా రం..ఆంధ్రప్రదేశ్ , గుంటూరు, ఉంగుటూరుకు చెందిన బత్తినేని శిరీష(27), బాపయ్య చౌదరి (31) దంపతులు కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-1 పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరికి కూతురు (3) సంతానం. దంపతులు గచ్చిబౌలిలోని దివ లేబరేటరీస్‌లో పనిచేస్తున్నారు. అధిక ఆదాయం కోసం బాపయ్య చౌదరి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు.

వాటిల్లో లాభం రాకపో గా...ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో దంపతుల మధ్య వివాదాలు మొ దలయ్యాయి. ఈ క్రమంలో పెండ్లి సమయంలో ఇచ్చిన ఆస్తులను భర్త విక్రయించాడని శిరీశకు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు ..బావకు విషయం చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాపయ్య సైతం గురువారం ఉదయం సనత్‌నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలి సోదరుడు కృష్ణ చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles