హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టొకరా

Fri,February 23, 2018 07:51 PM

Consultancy cheated unemployees in hyderabad

హైదరాబాద్: మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏబీసీ అనే కన్సల్టెన్సీ మెట్రో రైలులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో వ్యక్తి నుంచి రూ. రెండు లక్షలు వసూలు చేసింది. మొత్తం రూ. 1.50 కోట్లను వసూలు చేసింది. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా డొంకతిరుగులు మాటలు మాట్లాడుతున్న కంపెనీ నిర్వాహకులపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కన్సల్టెన్సీపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

1556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles