ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి

Mon,April 1, 2019 08:09 AM

congress mp candidate revanth reddy violated election code in jeedimetla

-ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జగద్గిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ తోరణాలు
-తోరణాలను తొలిగిస్తున్న శానిటేషన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పర్సనల్ అసిస్టెంట్


జీడిమెట్ల: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగద్గిరిగుట్ట డివిజన్‌లో చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు జగద్గిరిగుట్టలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తోరణాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తోరణాలను తొలిగిస్తున్న శానిటేషన్ సూపర్‌వైజర్ వీరారెడ్డితో ఎందుకు తోరణాలు తొలిగిస్తున్నావని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పీఏ నాగరాజు అడ్డుకొని అతడితో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది అధికారుల ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తోరణాలను పూర్తిగా తొలిగించారు.

4275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles