పేరుకే ప్రైవేటు.. వసతులకు పెద్ద లోటు

Sat,August 19, 2017 08:32 AM

congested class rooms in Hyderabad Private Schools  • దిగజారుతున్న ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి

  • పేదల బస్తీల్లో మరీ దారుణం

  • ఇరుకైన గదుల్లో విద్యార్థుల ఇబ్బందులు

  • బంజారాహిల్స్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు పెంపొందించేందుకు ఓ వైపు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంటే మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. విద్యాశాఖ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా స్కూళ్ల నిర్వహణ చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

    జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ బస్తీల్లో కొన్ని స్కూళ్లను చూస్తే పశువుల కొట్టాలను తలపిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరుకైన గదులు, రేకుల షెడ్లు, అపరిశుభ్రతతో కూడిన టాయ్‌లెట్స్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా విద్యాశాఖ అధికారులకు చీమ కుట్టినైట్లెనా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్‌లోని అపోలో దవాఖాన ఎదురుగా ఉన్న గీతాంజలి స్కూళ్లో తరగతి గదులు సరైన సంఖ్యలో లేకపోవడంతో ఆటస్థ్ధలంలో రేకుల షెడ్లువేసి తరగతులు నిర్వహిస్తున్నారు.

    200గజాల స్థలంలో ఆరు షెడ్లలో ఆరు తరగతులు నడుస్తున్నాయి. ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్న షెడ్లలో పిల్లలు కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. ఇక గౌతమ్‌నగర్‌లో ఇటీవల ప్రారంభమైన ఓ స్కూల్‌ను 20గజాల స్థలంలో ఉన్న ఓ చిన్న భవనంపై షెడ్డులో నడుపుతున్నారు. 10 నుంచి 15 అడుగుల విస్తీర్ణంలో తరగతులను నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం ఆరంభంలో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో పరిస్థితులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

    ఫిలింనగర్ 18బస్తీలు, ఇందిరానగర్, ఎన్‌బీటీనగర్, శ్రీరాంనగర్, సింగాడకుంట, ఉదయ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని 80శాతం ప్రైవేటు స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.20నుంచి 40వేలు వసూలు చేస్తున్న స్కూళ్లల్లోనూ పరిస్థితులు ఇదే విధంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సౌకర్యాలు లేకుండా విద్య్థాలను ఇబ్బందులకు గురిచ్తేన్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles