'మెట్రో' నుంచి చూస్తే అందంగా ఉండాలి!

Wed,March 27, 2019 06:27 AM

Commissioner Dana Kishore said beautification of the slums should be taken up on priority

హైద‌రాబాద్‌: మెట్రో రైలులో ప్రయాణించేవారికి ఇరువైపులా ఎక్కడా వ్యర్థాలు, మట్టి కుప్పలు కనపడకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అధికారులు మెట్రోలో ప్రయాణించి పరిస్థితిని గమనించాలని ఆయన సూచించారు.పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెట్రోరైలు ప్రాజెక్ట్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని పేర్కొన్నారు. సుమారు 62 కిలోమీటర్లమేర విస్తరించివున్న ఈ మార్గా ల్లో ఎక్కడా ఇరువైపులా చెత్తకానీ, డెబ్రిస్‌కానీ లేకుండా చూడాలని ఆదేశించారు. దీంతో పాటు నగరాన్ని మరింత పరిశుభ్రంగా నిర్వహించేందుకు మళ్లీ రాత్రి వేళల్లో స్వీపింగ్, వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టాలని కోరారు. ప్రధాన రహదారులు, జంక్షన్లలో స్వీపింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, ఓపెన్ గార్బేజ్ పాయింట్లను గుర్తించి వాటిని తొలగించాలని ఆదేశించారు. వీక్లీ మార్కెట్లు నిర్వహించే ప్రాంతాల్లో అదే రోజు రాత్రికి వ్యర్థాలను తొలగించాలని స్పష్టంచేశారు. పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించే సర్కిళ్లకు ర్యాంకులు అందజేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందుకోసం పారిశుధ్యంతోపాటు డెబ్రిస్ తొలగింపు, నాలాల్లో వ్యర్థాల తొలగింపు, తడి-పొడి చెత్తను విడదీసి స్వచ్ఛ ఆటోలకు అందించ డం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. తడి-పొడి చెత్తను విడదీయడంపై ప్రజల్లో అవగాహనకోసం 2500 స్వచ్ఛ రిసోర్స్ పర్సన్‌లను నియమించినట్లు గుర్తుచేస్తూ, వారి సేవలు ఉపయోగించుకోవాలని ఆదేశించారు.

1872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles