దేశానికి.. తెలంగాణ ఓ దిక్సూచి : కేసీఆర్Fri,April 21, 2017 01:04 PM

CM KCR speech in TRS Plenary

హైదరాబాద్ : భారతదేశానికే తెలంగాణ ఓ దిక్సూచి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నగరంలోని కొంపల్లి గార్డెన్ లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం ప్రసగించారు. పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 8వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ నాయకులకు ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు చెప్పారు సీఎం కేసీఆర్. 2001లో తెలంగాణ ఆగమై పోయిన సందర్భంలో జై తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందన్నారు. గులాబీ జెండా ఎగిరినప్పటి నుంచి అన్ని అనుమానాలే అన్నారు. ఈ పార్టీ నిలబడేది కాదన్నారు. 15 ఏళ్ల టీఆర్ఎస్ పోరాటంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని చెప్పారు.భయంకరమైన గుర్రపు డెక్కతో ఇరిగేషన్ వ్యవస్థ, రెండేళ్లు భయంకరమైన కరువు, రైతులు, చేనేతల ఆత్మహత్యలు, గుడుంబా రాజ్యం, భయంకరమైన పరిస్థితుల్లో ఆర్టీసీ ఉండేదన్నారు. సెక్రటేరియట్ లో తెలంగాణ ఉద్యోగులపై అణచివేతలు వంటి సమస్యలతో రాష్ట్రం ఉండేదన్నారు.

ఈ క్రమంలో గులాబీ పార్టీ ఉద్యమ పోరాటం చేసి.. కేంద్రం ప్రభుత్వం మెడలు వంచి.. 2014లో తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ మాజీ సీఎం కట్టెపట్టుకొని కరెంటు కష్టాలు వస్తాయన్నారు.. కానీ 9వేల 350 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి పథకాలతో అభివృద్ధి చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.కోటి ఎకరాలకు నీళ్లందించే విధంగా ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారన్నారు. నేషనల్ హైవేస్ 2వేల 500కి.మీ ఉండేవి.. ఇవాళ 5 వేల 800 కి.మీ జాతీయ రహదారులను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.

గ్రామీణ వ్యవస్థను బాగు పరచుకున్నాం.. కులవృత్తుల వాళ్లకు గొర్రెలు అందిస్తున్నామ్నారు. 25 వేల ఆధునిక క్షౌరశాలలు అందిస్తాం.. రజకులకు వాషింగ్ మిషన్ లు, నవీన్ ధోబీ ఘాట్ లను నిర్మించి ఇస్తాం.. రంగారెడ్డి, హైదరాబాద్ లలో కల్లు దుకాణాలను ఆనాటి ప్రభుత్వాలు కల్తీ కల్లు అని బ్యాన్ చేయగా మళ్లీ పునరుద్ధరించుకున్నామని చెప్పారు.బెస్తవాళ్లు, ముదిరాజ్ లకు చేపలు పంపిణీ చేస్తున్నాం అన్నారు. మత్స్య పరిశ్రమను ఏడాదికి 5 వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం అన్నారు. వ్యవసాయం అంటే పిల్లనివ్వడానికి వెనక్కి తగ్గే రోజులు పోయాయన్నారు. వ్యవసాయం అంటే ఏమిటో గడిచిన రెండు సంవత్సరాలు చేసి చూపించామన్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖలో 500 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.

2621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS