హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

Fri,December 28, 2018 06:43 PM

cm kcr reached hyderabad from his delhi tour

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 23న రాష్ర్టాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 23న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, 24న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. 24న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. 26న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

2112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles