సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సురేష్ రెడ్డి

Wed,September 12, 2018 05:24 PM

cm kcr inspriration to me from 1989 says sureshreddy

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ..1989 నుంచి సీఎం కేసీఆర్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులతో ప్రతీ ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మారిందన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరుతో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోందన్నారు.

సురేశ్ రెడ్డితో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లకా్ష్మరెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ముఖ్యనేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

2137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS