పీవీ సింధు గెలుపుపై సీఎం కేసీఆర్‌ అభినందనలు

Sun,December 16, 2018 12:42 PM

CM KCR Congratulates PV Sindhu

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్న పీవీ సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సింధును కేసీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. టైటిల్ విజేత సింధుకు గవర్నర్ నరసింహన్ కూడా అభినందనలు తెలియజేశారు. గతేడాది ప్రపంచ టూర్ ఫైనల్లో ఓడిన సింధు.. ఈ ఏడాది హోరాహోరీగా సాగిన తుదిపోరులో పోరాడి విజేతగా నిలిచింది.

2142
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles