మంత్రి నిరంజ‌న్‌రెడ్డి త‌ల్లి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Mon,July 22, 2019 10:31 AM

cm kcr condolence to singireddy niranjan reddy mothers death

హైద‌రాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృ మూర్తి సింగిరెడ్డి తారకమ్మ మరణం పట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తారకమ్మ మరణం నిరంజన్ రెడ్డికి తీరని లోటు అని పేర్కొన్నారు. నిరంజ‌న్‌రెడ్డికి, కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తారకమ్మ అంత్యక్రియలు ఈరోజు మూడు గంటలకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వనపర్తి కి 13 కిలోమీటర్ల దూరంలోని పాన్‌గ‌ల్‌ మండలం కొత్తపేట శివారులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles