కేసీఆర్ బొమ్మతో నాణేలు ఆవిష్కరణ

Tue,May 8, 2018 05:15 PM

CM KCR coins release by KCR at Pragathi Bhavan

హైదరాబాద్ : సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బొమ్మతో ముద్రించిన నాణేలను స్వయంగా కేసీఆరే ఇవాళ ఆవిష్కరించారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతో కేసీఆర్ టీఆర్ఎస్ సపోర్టర్స్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా.. కోర్ కమిటి మెంబర్ సురేష్ గోపతి మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే ఈ నాణేలను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ నాణేలను సీఎం కేసీఆర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కోర్ కమిటి మెంబర్ భాస్కర్ మొట్ట మాట్లాడుతూ.. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో విందు తరువాత జరిగిన మీటింగ్ లో ఆయన ఎన్ఆర్ఐల బాగోగులను అడిగి తెలుసుకోవడం గొప్పగా అనిపించింది అన్నారు. సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పుల కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్ కు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

12754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS