రక్తం చిందకుండా ఉద్యమాన్ని నడిపాం: సీఎం కేసీఆర్

Thu,January 18, 2018 02:40 PM

CM KCR attend India today south conclave 2018 in park hyatt hotel hyderabad

★ అభివృద్ధిలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ
★ తెలంగాణ ను పునర్నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగస్వాములమైనం
★ ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డం
★ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పునరుజ్జీవ ప్రయత్నం
★ హైదరాబాద్ కు దేశ రెండో రాజధాని హోదా కల్పిస్తే స్వాగతం
★ రక్తపాతం లేకుండా తెలంగాణ ఉద్యమం నడిపినం
★ 2020 నాటికి కోటి ఎకరాలకు సాగు నీరు
★ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి
★ హైదరాబాద్ గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక
★ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సమన్వయ సమితులు
★ ఇండియా టుడే సౌత్ కాంక్లే వ్-2018 లో కేసీఆర్

హైదరాబాద్: రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను పునర్‌నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని ఆయ‌న తెలిపారు. ఆర్థికాభివృద్ధి రేటులో ఇదే ఒరవడిని కొనసాగిస్తామ‌న్నారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఆంధ్ర, తెలంగాణకు చాలా తేడా ఉందన్నారు. రెండు ప్రాంతాల ప్రజల జీవన విధానం వేర‌న్నారు. తెలుగు అనే ఐడేంటీనే లేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల‌ పేరుతో ఆంధ్ర - తెలంగాణ విలీనం చారిత్రక తప్పిదం. నిజాం హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వర్థిల్లిందన్నారు.

హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి, హైదరాబాద్‌పై ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. హింసకు తావులేకుండా రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం1గా నిలిచిందని సీఎం వివరించారు. మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో మార్పు ఎలా సాధ్యమైంది, విభజనకు ముందున్న అనుమానాలన్నీ ఎలా నివృత్తి చేయగలిగారని రాజ్‌దీప్ ప్రశ్నించారు. ఆ ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.300 ఏళ్లక్రితం మార్వాడీలు హైదరాబాద్ వచ్చి తెలంగాణ మా మాతృభూమి అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డామ‌న్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి చేరుకున్నామ‌ని సీఎం తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల‌ కంటే ముందుందన్నారు. తెలంగాణ కంటే 17 చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తున్నం. 38 లక్షల గొర్రెలను పంపిణి చేసి అనుకున్న లక్ష్యం దిశగా పోతున్నాం. రూ.100 ఉన్న ఆసరా పెన్షన్‌ను రూ. 1000కి పెంచాం. వ్యవసాయంలో కూడా తెలంగాణ ఆదర్శంగా నిలవబోతున్నది. దేశంలోనే తెలంగాణ అగ్రరాష్ట్రంగా నిలుస్తుందనే నమ్మకంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌న్నారు.

పట్టుదలతో అభివృద్ధి సాధించి ఆచరణలో చూపామ‌ని సీఎం తెలిపారు. హైదరాబాద్ చరిత్ర తెలిసిన వారెవరైనా అది తెలంగాణలో అంతర్భాగమేనని అంగీకరిస్తారు. ఎన్నో మతాలవాళ్లు, ఎన్నో ప్రాంతాల వాళ్లు దశాబ్ధాలుగా ఇందులో భాగమై జీవిస్తున్నారు. ఎవరో కొందరు ఆంధ్ర నేతలు మాత్రమే ఉద్యమ సమయంలో హైదరాబాద్‌పై అర్ధంపర్థంలేని వాదనలు చేశారు. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే నెం.1 రాష్ట్రంగా ఉంది. హైదరాబాద్‌కు దేశ రెండో రాజధానిగా గౌరవమిస్తామంటే స్వాగతిస్తామని సీఎం తెలిపారు.

6217
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles