టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Sun,May 12, 2019 06:43 PM

CM KCR Announced TRS MLC Candidates List

హైదరాబాద్‌: వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డిని కేసీఆర్‌ ఖరారు చేశారు. ఆయా జిల్లాల మంత్రులతో సీఎం సమావేశమై అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. ముగ్గురు అభ్యర్థులకు బి-ఫారాలను కూడా ఇవ్వనున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని, సునాయాసంగా విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

4125
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles